Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన మరుగుదొడ్డిలో పాలిథిన్ కవర్లు - వస్త్రాలు.. విచారణకు ఏఐ ఆదేశం

ఠాగూర్
మంగళవారం, 11 మార్చి 2025 (09:28 IST)
ఈ నెల ఆరో తేదీ నుంచి షికాగో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానం పది గంటల ప్రయాణం తర్వాత తిరిగి షికాగోకు వెళ్లింది. ఈ వ్యవహారంపై విమానయాన సంస్థ విచారణ జరిపి ఓ స్పష్టతనిచ్చింది. 
 
ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా 126 విమానంలోనే టాయిలెట్ల సమస్య తలెత్తిందని, మొత్తం 12 టాయిలెట్లు ఉండగా, అందులో ఎనిమిది పని చేయడం లేదని సిబ్బంది గుర్తించారని సంస్థ పేర్కొంది. టాయిలెట్ పైపుల్లో పాలిథిన్ బ్యాగులు, దుస్తులు ఇరుక్కునిపోవడం వల్ల అవి పనిచేయడం లేదని తెలిపింది. 
 
ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైనట్టు తెలిపింది. ఆ సమయంలో విమానం అట్లాంటిక్ మీదుగా ప్రయాణిస్తుండగా ఐరోపాలోని నగరాల్లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించారు. రాత్రి సమయం కావడం, అక్కడి విమానాశ్రయాల్లో ల్యాండింగ్‌పై ఆంక్షలు ఉండటంతో తిరిగి షికాగోకు మళ్లించాల్సి వచ్చిందని విమానయాన సంస్థ వెల్లడించింది. 
 
ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని ఎయిరిండియా తెలిపింది. విమానాన్ని వెనక్కి మళ్లించిన అనంతరం ఎయిరిండియా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments