Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌హోస్టెస్‌పై ఉమ్మివేసిన పైలట్.. చెంప పగిలిపోయింది...

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ విమానాశ్రయం వెలుపల ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ విమానయాన సంస్థకు చెందిన పైలట్, ఎయిర్‌హోస్టెస్‌లు బాహాబాహీకి దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడు ఉద్రిక్తతత నెలకొంది.

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (10:18 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ విమానాశ్రయం వెలుపల ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ విమానయాన సంస్థకు చెందిన పైలట్, ఎయిర్‌హోస్టెస్‌లు బాహాబాహీకి దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడు ఉద్రిక్తతత నెలకొంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
గుర్గావ్‌కు చెందిన అర్పిత అనే ఎయిర్ హోస్టెస్, ఆదిత్యకుమార్ అనే పైలట్‌లు ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో పని చేస్తున్నారు. వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆదిత్య మొబైల్‌ను అర్పిత పగులగొట్టేందుకు ప్రయత్నించగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది కలుగజేసుకొని అడ్డుకున్నారు. 
 
ఆ తర్వాత అర్పిత, ఆదిత్యల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆదిత్య ఆమెపై ఉమ్మివేశాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆమె ఆదిత్య చెంపపై కొట్టింది. అక్కడే ఉన్న భద్రతాసిబ్బంది కొట్టుకుంటున్న వారిని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు వర్గాలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది.
 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments