Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునామీలో రానున్న కరోనా థర్డ్ వేవ్ : ఎయిమ్స్ చీఫ్

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (20:13 IST)
దేశంలో కరోనా వైరస్ మూడో దశ వ్యాప్తి ఓ సునామీలా విరుచుకుపడనుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా జోస్యం చెప్పారు. ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో అనేక రాష్ట్రాలు కరోనా లాక్డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్‌ను ఎత్తివేస్తున్నాయి. 
 
ఈ క్రమంలో భారత్‌లో థర్డ్‌వేవ్‌ వ్యాపించడం అనివార్యమని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ ర‌ణ్‌దీప్‌ గులేరియా అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 6 నుంచి 8 వారాల్లో కొవిడ్‌ మూడో వేవ్‌ విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించారు. 
 
అన్‌లాక్ కార‌ణంగా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని, దాంతో వైరస్ రూపాంత‌రం చెందుతూ ఉంటుందని ఆయ‌న తెలిపారు. కొవిడ్ హాట్‌స్పాట్లలో తగిన నిఘా ఉంచ‌డం అవసరమన్నారు. దేశంలో ఉన్న జనాభాకు టీకాలు అందించడం, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ డోస్‌కు, డోస్‌కు మధ్య అంతరం తగ్గించడం సవాల్‌గా మారిందన్నారు. 
 
కరోనా మొదటి, రెండో వేవ్‌ల నుంచి ఏం నేర్చుకున్నామో గుర్తు చేసుకోవాల‌న్నారు. కానీ, పలు రాష్ట్రాలు అన్‌లాక్‌ చేయడంతో జ‌నం కనీస కొవిడ్‌ నిబంధనలు కూడా పాటించడం లేద‌ని వాపోయారు. ప‌రిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరుగ‌డం, థర్డ్ వేవ్ సునామీలా విరుచుకుపడటం ఖాయమని డాక్టర్ ర‌ణ్‌దీప్‌ గులేరియా హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments