Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నమ్మా... మాకు మీరే దిక్కు... పార్టీ పదవితో పాటు.. సీఎం కుర్చీ కూడా మీదే... అన్నాడీఎంకే నేతలు

ముఖ్యమంత్రి జయలలిత ప్రియ నెచ్చెలి శశికళకు రాజయోగం వరించిందని చెప్పొచ్చు. పార్టీ నేతలంతా ఆమె వద్దకు వెళ్లి పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ మోకరిల్లుతున్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి పగ్గాలు కూడా స్వీకరించాలని

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (11:56 IST)
ముఖ్యమంత్రి జయలలిత ప్రియ నెచ్చెలి శశికళకు రాజయోగం వరించిందని చెప్పొచ్చు. పార్టీ నేతలంతా ఆమె వద్దకు వెళ్లి పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ మోకరిల్లుతున్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి పగ్గాలు కూడా స్వీకరించాలని ప్రాధేయపడుతున్నారు. ఈ మేరకు సీనియర్ నాయకులు కొంతమంది కలిసి శశికళను కలిసి.. ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాలని కోరారు.
 
అనారోగ్యంతో ముఖ్యమంత్రి జయలలిత మరణించిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై సహా పలువురు సీనియర్ నాయకులకు వెళ్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాల్సిందిగా చిన్నమ్మను కోరారు. జీవితాంతం జయలలిత అదే పదవిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అమ్మ లేరు కాబట్టి.. చిన్నమ్మ శశికళే ఈ బాధ్యతలు తీసుకోవాలని వాళ్లంతా కోరారు.
 
అంతేకాదు, ఇప్పటికే చెన్నైలోని పలు ప్రాంతాల్లో శశికళ పేరు మీద పెద్దపెద్ద హోర్డింగులు కూడా వెలిశాయి. మరోవైపు అన్నాడీఎంకేలోని ఒక విభాగమైన జయలలిత పెరవై.. శశికళ ఈ రెండు పదవులనూ చేపట్టాలని, ఇంతకుముందు జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుతూ ఒక తీర్మానం కూడా ఆమోదించింది. 
 
తమిళనాడు రెవెన్యూ శాఖ మంత్రి, పెరవై సెక్రటరీ అయిన ఆర్‌బీ ఉదయకుమార్ ఈ మేరకు 'తాయి తంద వరం చిన్నమ్మ' (అమ్మ ఇచ్చిన వరమే చిన్నమ్మ) అనే శీర్షికతో ఉన్న తీర్మానం కాపీని శశికళకు అందించారు. సమాచార ప్రసార శాఖ మంత్రి కదంబూర్ రాజు, దేవాదాయ శాఖ మంత్రి సెవూర్ ఎస్. రామచంద్రన్, మరో 50 మంది పెరవై సభ్యులు అంతా ఉదయకుమర్‌తో సహా వెళ్లి శశికళను కలిసి ఈ విన్నపం చేశారు. 

అమ్మాయిలు షీ సేఫ్ యాప్ తో సేఫ్ గా ఉండాలి : కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments