Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళను ఇప్పుడల్లా పార్టీ నుంచి పీకేయలేరా..? ఎన్డీయేలోకి అన్నాడీఎంకే?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించేందుకు ముగ్గురు మంత్రులు అడ్డం పడుతున్నారని తెలిసింది. దీంతో చిన్నమ్మను సాగనంపే ప్రక్రియకు సీఎం ఎడప్పాడి పళని స్వామి ముగింపు పలకలేకపోయారని వార్త

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (15:47 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించేందుకు ముగ్గురు మంత్రులు అడ్డం పడుతున్నారని తెలిసింది. దీంతో చిన్నమ్మను సాగనంపే ప్రక్రియకు సీఎం ఎడప్పాడి పళని స్వామి ముగింపు పలకలేకపోయారని వార్తలు వస్తున్నాయి. సోమవారం సాయంత్రం ఓపీఎస్ తన మద్దతుదారులతో కలిసి ప్రమాణ స్వీకారంలో పాల్గొననున్నారు. కొత్త మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. 
 
ఇప్పటికే ఓపీఎస్-ఈపీఎస్ వర్గాలు ఏకమైన తరుణంలో చిన్నమ్మను పార్టీ నుంచి తొలగించేందుకు ముగ్గురు మంత్రులు అంగీకరించలేదని తెలుస్తోంది. దినకరన్ తరహాలోనే చిన్నమ్మను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించేందుకు చేసిన తీర్మానంలో ముగ్గురు మంత్రులు సంతకాలు చేయకపోవడంతో వారిని బుజ్జగించే పనులు జరుగుతున్నాయని తెలిసింది.
 
అన్నాడీఎంకే ఇరు వర్గాలు ఏకమైన తరుణంలో ఎన్డీయేలో ఆ పార్టీ కలవనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తమిళనాడులో పర్యటించనున్న నేపథ్యంలో ఓపీఎస్-ఈపీఎస్ సమావేశమై పార్టీని ఎన్డీయేలో కలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ బీజేపీలో కలిసిన తరహాలోనే అన్నాడీఎంకే కూడా ఎన్డీయేలో కలిసిపోతుందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments