Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో బుల్లెట్ ట్రెయిన్... అహ్మదాబాద్-ముంబై... రూ. 88 వేల కోట్ల వ్యయం

భారతదేశంలో త్వరలో బుల్లెట్ ట్రెయిన్ పరుగులు తీయనుంది. అహ్మదాబాద్ - ముంబై మధ్య రూ. 88 వేల కోట్ల వ్యయంతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. మొత్తం 508 కిలో మీటర్ల దూరాన్ని ఈ బుల్లెట్ ట్రెయిన్ కేవలం 2 నుంచి 3 గంటల్లోనే చేరుకుంటుంది. మామూలుగా అయితే ఎక్స

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (16:22 IST)
భారతదేశంలో త్వరలో బుల్లెట్ ట్రెయిన్ పరుగులు తీయనుంది. అహ్మదాబాద్ - ముంబై మధ్య రూ. 88 వేల కోట్ల వ్యయంతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. మొత్తం 508 కిలో మీటర్ల దూరాన్ని ఈ బుల్లెట్ ట్రెయిన్ కేవలం 2 నుంచి 3 గంటల్లోనే చేరుకుంటుంది. మామూలుగా అయితే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ వ్యవధి 8 గంటల పాటు సాగుతుంది. ఐతే ఈ బుల్లెట్ రైలుతో ప్రయాణ కాలం సుమారు 5 గంటలకు పైగా ఆదా అవుతుంది. ఈ రైలు మార్గాన్ని భూమికి 20 మీటర్ల పైన పిల్లర్లతో నిర్మించనున్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు జపాన్ ప్రధాని శంకుస్థాపన చేసేందుకు బుధవారం భారతదేశానికి వచ్చారు.
 
ప్రోటోకాల్ పక్కన పెట్టి జపాన్ ప్రధానికి స్వాగతం చెప్పేందుకు ప్రధానమంత్రి మోదీ విమానాశ్రయానికి వెళ్లారు. జపాన్‌ ప్రధాని షింజో అబె భార‌త ప్ర‌ధాని మోదీతో క‌లిసి గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్‌ రోడ్‌షోలో పాల్గొన్నారు. అనంతరం జపాన్ ప్రధానమంత్రి మాట్లాడుతూ... భార‌తదేశంతో త‌మ దేశానికి మ‌ధ్య ఉన్న‌ బంధం ప్రపం‍చంలోనే అత్యంత శక్తిమంతమైనదని అన్నారు. భారతదేశంతో వ్యాపార సంబంధాలను మరింత పెంచుకునేందుకు జపాన్ దేశం ఆసక్తిగా వున్నట్లు వెల్లడించారు. తమకున్న సాంకేతిక శక్తితో భారతదేశంలోని మానవ వనరులతో కలిపి భవిష్యత్తులో తిరుగులేని విజయాలను సాధిస్తామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్బరిక్ స్ట్రైకింగ్ మోషన్ పోస్టర్

శివారెడ్డిని ఇండస్ట్రీలో తొక్కేసింది సీనియర్ కమేడియనా? మేనేజరా?

కంటెంట్ ఉంటే సినిమాకి జనాలొస్తారు: రాకేష్ వర్రే

ప్రతిభగల వారికోసం ప్రభాస్ ప్రారంభించిన ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్ సైట్

ట్రెండ్ కు భిన్నంగానే ధూం ధాం చేశా : చేతన్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments