Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు బిడ్డ కావాలి, ఆ డాక్టరుతో పడుకో, భర్త దారుణం

కట్టుకున్న భార్యకు నరకం చూపించాడు ఓ రాక్షసుడు. తనకు లైంగిక సామర్థ్యం లేకపోవడంతో దాన్ని దాచిపెట్టేందుకు భార్యను తన తండ్రితో, ఓ వైద్యుడితో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేశాడు. ఆ హింసను భరించలేని బాధితు

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (19:55 IST)
కట్టుకున్న భార్యకు నరకం చూపించాడు ఓ రాక్షసుడు. తనకు లైంగిక సామర్థ్యం లేకపోవడంతో దాన్ని దాచిపెట్టేందుకు భార్యను తన తండ్రితో, ఓ వైద్యుడితో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేశాడు. ఆ హింసను భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
వివరాల్లోకి వెళితే... అహ్మదాబాదుకు చెందిన గిరిని మార్చి 2016లో బాధితురాలు వివాహం చేసుకుంది. ఐతే మొదటిరాత్రే భర్త ఆమెను దూరంగా పెట్టాడు. తనకు చాలినంత కట్నం ఇవ్వలేదంటూ చెప్పి ఆమెతో శృంగారంలో పాల్గొనకుండా దూరం పాటించాడు. ఆ తర్వాత అతడి అసలు బలహీనత బాధితురాలికి తెలిసిపోయింది. దానితో అతడు తనకు బిడ్డ కావాలనీ, తన తండ్రితో శృంగారం చేసి సంతానాన్ని ఇవ్వాలంటూ ఒత్తిడి చేశాడు. 
 
ఆమె నిరాకరించేసరికి తన స్నేహితుడైన వైద్యుడితోనైనా లైంగిక క్రియలో పాల్గొని సంతానాన్ని పొందాలంటూ ఒత్తిడి చేశాడు. ఇలా భర్త ప్రోత్సాహంతో వాళ్లిద్దరూ ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. కొన్నిసార్లు వారు ఇంట్లోకి వస్తున్నారని తెలిసి ఆమె బయటకు పారిపోయేదాన్నని చెప్పింది. చివరికి భర్త హింసను భరించలేక, తనపై ఇద్దరు మగాళ్లు ఏ క్షణమైనా అఘాయిత్యం చేస్తారన్న భయంతో పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు వెల్లడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం