Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామీణ్ సడక్ యోజన్ పుణ్యం.. 69 సంవత్సరాల తర్వాత ఆ గ్రామానికి బస్సొచ్చింది..!

స్వతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ గ్రామానికి రోడ్డు మార్గమే లేదు. ఇక బస్సొచ్చేందుకు దారెక్కడిదీ.. అడవి మధ్యలో గుట్టల మీదుగా నడకదారే ఆ గ్రామ వాస్తవ్యులకు శరణ్యం. ఆ గ్రామంలోని కొందరు వృద్ధులు తమ జీవితకాలం

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (12:46 IST)
స్వతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ గ్రామానికి రోడ్డు మార్గమే లేదు. ఇక బస్సొచ్చేందుకు దారెక్కడిదీ.. అడవి మధ్యలో గుట్టల మీదుగా నడకదారే ఆ గ్రామ వాస్తవ్యులకు శరణ్యం. ఆ గ్రామంలోని కొందరు వృద్ధులు తమ జీవితకాలంలో బస్సును కళ్లారా చూసి ఎరగరు. కానీ 69 సంవత్సరాల తర్వాత ఆ గ్రామస్తుల ఎదురుచూపులు ఫలించాయి. 
 
ఆ గ్రామానికి బస్సొచ్చింది. అంతే ఆ గ్రామ ప్రజల ఆనందానికి అవధుల్లేవ్. ఇదంతా ఉత్తరాఖండ్‍‌లోని మారుమూల గ్రామం సిల్పతాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన్ పుణ్యమా అంటూ సమకూరిన నిధులతో ఉత్తరాఖండ్‌లోని సిల్పతా గ్రామంలో ఇటీవలే కేంద్రం రోడ్డు నిర్మాణం పూర్తి చేసింది. 
 
చమోలీ జిల్లా కేంద్రానికి, సిల్పతా గ్రామానికి మధ్య దూరం 21 కిలోమీటర్లు కాగా, ఈ గ్రామానికి చేరుకునేందుకు రోడ్డు మార్గం లేదు. దీంతో 21 కిలోమీటర్ల రోడ్డు మార్గం కోసం 69 ఏళ్ల పాటు ఆ గ్రామ ప్రజలు ఆత్రుతతో ఎదురుచూడాల్సి వచ్చింది. ఇంకా బస్సుల కోసం ఆ గ్రామ ప్రజలు వేయికనులతో ఎదురుచూశారు. 
 
అయితే తొలిసారిగా తమ గ్రామానికి బస్సు వస్తుందని తెలిసి గ్రామస్తులు ఎగిరిగంతేశారు. బస్సుకు స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆడుతూపాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments