Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సీఎం పబ్లిక్ రిలీఫ్ ఫండ్‌కు విరాళాల వెల్లువ

Webdunia
సోమవారం, 17 మే 2021 (15:52 IST)
కరోనా రోగుల వైద్య సేవల నిమిత్తం రాష్ట్ర ప్రజలు విరాళాలు ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమ స్వచ్ఛందంగా స్పందిస్తోంది. 
 
కొవిడ్ కట్టడి కోసం సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా సీఎం స్టాలిన్ కార్యాలయానికి వెళ్లి రూ.50 లక్షల చెక్కు అందజేశారు. కరోనా సహాయకచర్యలకు ఉపయోగించాలని కోరారు. 
 
తాజాగా, ప్రముఖ నటుడు విక్రమ్ కూడా తనవంతు విరాళం ప్రకటించారు. ఆన్‌లైన్ ద్వారా 30 లక్షల రూపాయలను తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి బదిలీ చేశారు.
 
అంతకుముందు, రజనీకాంత్ అల్లుడు విశాఖన్ వనంగ్‌ముడి రూ.1 కోటి విరాళం అందించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో విరివిగా విరాళాలు ఇవ్వాలని సీఎం స్టాలిన్ ఇటీవలే బహిరంగ ప్రకటన చేశారు. ఆయన ప్రకటనకు మంచి స్పందనే వస్తోంది.
 
అంతేకాకుండా, సన్ టీవీ యాజమాన్యం కూడా సీఎం పబ్లిక్ రిలీఫ్ ఫండ్‌కు రూ.10 కోట్ల వరకు విరాళాలు అందించింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఆ సంస్థ ఎండీ కళానిధి మారన్ దంపతులు కలిసి అందజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments