Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ నటి.. మాజీ ఎంపీ రమ్యపై దేశద్రోహం కేసు .. వచ్చే వారంలో వాదనలు

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, కన్నడ సినీ నటి రమ్యపై ఓ న్యాయవాది దేశద్రోహం కేసు పెట్టారు. దీనిపై వచ్చేవారం వాదనలు జరుగనున్నాయి. పాకిస్థాన్‌కు వంతపాట పాడినందుకుగాను ఆమెపై ఈ కేసు నమోదైంది.

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2016 (12:10 IST)
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, కన్నడ సినీ నటి రమ్యపై ఓ న్యాయవాది దేశద్రోహం కేసు పెట్టారు. దీనిపై వచ్చేవారం వాదనలు జరుగనున్నాయి. పాకిస్థాన్‌కు వంతపాట పాడినందుకుగాను ఆమెపై ఈ కేసు నమోదైంది. ఇస్లామాబాద్‌లో కొన్ని రోజుల క్రితం సార్క్ స‌ద‌స్సు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. 
 
ఆ స‌ద‌స్సులో పాల్గొన్న ర‌మ్య అనంత‌రం భారత్‌కు చేరుకున్న సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కొందరు అన్నట్లుగా పాకిస్థాన్‌ నరకమేమీ కాదని, అక్కడి ప్రజలంతా భార‌తీయులలాంటి వారేన‌ని, వారు సుఖసంతోషాలతో జీవిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. త‌మ‌ని పాకిస్థానీయులు చాలా బాగా చూసుకున్నారని పేర్కొన్నారు. 
 
దీంతో తాజాగా ఆమెపై కర్ణాటకలోని మదికేరీలో కత్నమణె విట్టల్‌ గౌడ అనే న్యాయవాది దేశ ద్రోహం కేసు పెట్టారు. వ‌చ్చే శ‌నివారం కోర్టు ఈ కేసులో వాద‌న‌లు విన‌నుంది. ర‌మ్య చేసిన ఈ వ్యాఖ్య‌లే వివాదాస్పదంగా మారాయి. ఓవైపు భార‌త హోం మంత్రి రాక‌ను నిర‌సిస్తూ పాక్ నిర‌స‌నలు తెలిపిన వేళ, కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్ పాకిస్థాన్‌ను నరకంతో పోల్చిన వేళ ర‌మ్య ఇటువంటి వ్యాఖ్య‌లు చేయడంతో ఆమె చిక్కుల్లో పడ్డారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments