లెఫ్ట్ పార్టీలకు జాతీయ హోదా రద్దు

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (08:44 IST)
వామపక్ష పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఉన్న పార్టీలకు జాతీయ హోదా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిపిఐ, సిపిఎం పార్టీల కు జాతీయ పార్టీ హోదాను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా సీపీఎం, సీపీఐ పార్టీలకు పార్టీ జాతీయ హోదా రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఏదైనా పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా రావాలంటే ఒక రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. అలాగే కనీసం రెండు అసెంబ్లీ స్థానాలను అయినా కైవసం చేసుకుని ఉండాలి.  
 
అంతేకాదు ఆ రాష్ట్రంలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లతో పాటు ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవాలి. ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని అయినా గెలవాలి.  
 
అలా కూడా కాని పక్షంలో ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3 శాతం ఓట్లు లేదా మూడు అసెంబ్లీ స్థానాల్లో అయినా విజయం సాధించాలి. లోక్‌సభ లేదా శాసనసభలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో పోలై చెల్లిన ఓట్లలో 8 శాతం ఓట్లు వచ్చి ఉండాలి.
 
కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పార్టీలు ప్రభావం చూపని నేపథ్యంలో ఆ పార్టీలకు జాతీయ పార్టీ హోదాలు రద్దు చేసినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆ పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments