Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు గురువారం ఉదయం 10.30 గంటలకు

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (16:39 IST)
షిల్లాంగ్‌లో అకాలమరణం చెందిన మాజీ రాష్ట్రపతి అంత్యక్రియలు గురువారం ఉదయం 10.30 గంటలకు ఆయన పుట్టిపెరిగిన రామేశ్వరంలో జరుగనున్నాయి. ఈ వేడుకల కోసం తమిళనాడు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఇందులోభాగంగా కలాం అంత్యక్రియలు జరిగే ప్రదేశాన్ని కన్యాకుమారి జిల్లా కలెక్టర్, ఎస్పీలు పరిశీలించి, అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ అంత్యక్రియల ఏర్పాట్లను తమిళనాడు సీనియర్ మంత్రి ఒ.పన్నీర్ సెల్వం పర్యవేక్షించేలా ముఖ్యమంత్రి జయలలిత ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.
 
ఇదిలావుండగా, ప్రస్తుతం ఢిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న కలాం అధికారిక నివాసంలో ఆయన పార్థివదేహం ఉంది. ఇక్కడ వివిధ పార్టీలకు చెందిన నేతలు కలాంకు నివాళులు అర్పిస్తున్నారు. అనంతరం రేపు ఉదయం ఢిల్లీ నుంచి తమిళనాడులోని రామేశ్వరానికి ఆయన పార్థివదేహాన్ని తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం రాత్రి 7 గంటల వరకు ఉంచుతారు. ఆ తర్వాత గురువారం ఉదయం 10.30 గంటలకు కలాం అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా జరుగుతాయని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వాస్తవానికి కలాం అంత్యక్రియలు బుధవారమే జరుగుతాయన్న వార్తలు వచ్చాయి. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments