Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఆర్థిక మంత్రిగా చార్టెర్డ్ అకౌంటెంట్?

Delhi Election
Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (11:00 IST)
దేశ రాజధాని హస్తిన పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ముచ్చటగా మూడోసారి సొంతం చేసుకుంది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రేమికుల రోజైన ఈనెల 14వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు, మంత్రివర్గ కూర్పుపై కూడా ఆయన కసరత్తు చేస్తున్నారు. 
 
ఈ దఫా మంత్రివర్గంలో పలువురు యువ ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా, గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఇద్దరు యువ నేతలకు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వగా, వారిద్దరూ విజయభేరీ మోగించారు. వారు ఎవరోకాదు.. ఒరు రాఘవ్ చాదా కాగా, మరొకరు అతిషి మర్లేనా. 
 
రాజీందర్‌ సింగ్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాఘవ్‌ చాదా వృత్తిరీత్యా చార్టర్డ్‌ అకౌంటెంట్‌. ఈయనకు ఆర్థిక శాఖ కట్టబెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆప్‌ అధికార ప్రతినిధిగా, పార్టీ లీగల్‌ అఫైర్స్‌ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. 2015లో ఆప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ సలహాదారుగా చాదా పని చేశారు. అయితే రాఘవ్‌ నియామకం చట్టవిరుద్ధమని పేర్కొంటూ కేంద్రం ఆయనతో పాటు మరో 9 మందిని తొలగించింది. దీంతో చాదా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ తరపున పోటీ చేసి ఓటమి చవిచూశారు.
 
అలాగే, కల్కాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అతిషి మర్లేనాకు విద్యాశాఖ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో విద్యాశాఖ విషయంలో డిప్యూటీ సీఎం మనీశ్‌ సిపోడియాకు సలహాదారుగా పని చేసిన అతిషి.. ఢిల్లీ విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆప్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ సభ్యురాలిగా ఆమె కొనసాగుతున్నారు. అతిషి కూడా 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments