Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ ఎమ్మెల్యేను కాలర్ పట్టుకుని లాక్కెళ్లిన పోలీసులు.. ప్రెస్‌మీట్ జరుగుతుండగానే...

ఢిల్లీలోని ఆప్ సర్కారుకు చెందిన ప్రజాప్రతినిధులు చేస్తున్న తప్పులు, చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల వల్ల లేనిపోని కష్టాలు తెచ్చుకుంటున్నారు. తమ ప్రాంతానికి మంచినీటి సరఫరా చేయండయ్యా అని అడిగేందుకు వెళ్లిన మహిళ పట్ల ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహనియా దురుసుగా

Webdunia
శనివారం, 25 జూన్ 2016 (14:49 IST)
ఢిల్లీలోని ఆప్ సర్కారుకు చెందిన ప్రజాప్రతినిధులు చేస్తున్న తప్పులు, చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల వల్ల లేనిపోని కష్టాలు తెచ్చుకుంటున్నారు. తమ ప్రాంతానికి మంచినీటి సరఫరా చేయండయ్యా అని అడిగేందుకు వెళ్లిన మహిళ పట్ల ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహనియా దురుసుగా ప్రవర్తించగా, ఆ మహిళ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా జరిగిన ఓ సంఘటన ఢిల్లీలో కలకలం రేపుతోంది.
 
గడచిన ఎన్నికల్లో ఆప్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన దినేశ్ మోహనియా... ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో నీటి కొరతపై వినతి ఇచ్చేందుకు తన కార్యాలయానికి వచ్చిన ఓ వృద్ధుడితో పాటు పలువురు మహిళల పట్ల దినేశ్ దురుసుగా వ్యవహరించారు. సమస్యలను విన్నవించేందుకు వచ్చిన వారిని దినేశ్ తోసేయడమేకాకుండా వారిపై తిట్ల దండకం అందుకున్నారు. 
 
దీంతో షాక్ తిన్న బాధితులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దినేశ్‌ను అరెస్టు చేసేందుకు ఆయన కార్యాలయానికి రాగా, ఆసమయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. అయినప్పటికీ.. ఏమాత్రం లెక్క చేయకుండా ఆయనను అరెస్టు చేసి జీపు ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. 

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments