Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజ్రీవాల్ యాక్సిస్ బ్యాంక్ ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారు: కపిల్ మిశ్రా

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హవాలా లావాదేవీలను నడుపుతున్నారని, 16 డొల్ల కంపెనీల ద్వారా ఆప్ నేతల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరుతున్నాయని ఆప్ మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.2

Webdunia
ఆదివారం, 14 మే 2017 (13:45 IST)
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హవాలా లావాదేవీలను నడుపుతున్నారని, 16 డొల్ల కంపెనీల ద్వారా ఆప్ నేతల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరుతున్నాయని ఆప్ మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.2 కోట్ల లంచం తీసుకోవడాన్ని తాను కళ్ళారా చూశానని ఆరోపించిన మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించి, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
 
కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మిశ్రా చేపట్టిన దీక్ష ఆదివారం నాటికి ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మిశ్రా మాట్లాడుతూ.. యాక్సిస్ బ్యాంక్ ద్వారా కేజ్రీవాల్ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుడు లెక్కలు సమర్పించిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పలు ఆధారాలను చూపారు. ఆప్ నేతలకు అడ్డదారుల్లో విరాళాలు అందాయన్నారు.
 
16 డొల్ల కంపెనీల ద్వారా ఆప్ నేతల ఖాతాల్లోకి డబ్బులు చేరాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ కపిల్ మిశ్రా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సహచరులు ఆయన హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే తన భర్త ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తే ఆప్ నేతల అవినీతికి సంబంధించిన డాక్యుమెంట్లను తానే సీబీఐకి అందజేస్తానని మిశ్రా భార్య ప్రీతి మిశ్రా తెలిపారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments