Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ అనుసంధాన గడువు నిరవధిక పొడగింపు : సుప్రీంకోర్టు

ఆధార్ నంబరు అనుసంధాన ప్రక్రియకు సంబంధించి గడువును సుప్రీంకోర్టు నిరవధికంగా పొడగించింది. ఈ కేసు విచారణ పూర్తయ్యేంతవరకు ఆధార్ నంబరు అనుసంధాన ప్రక్రియను తప్పనిసరి చేయరాదని స్పష్టంచేసింది.

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (18:09 IST)
ఆధార్ నంబరు అనుసంధాన ప్రక్రియకు సంబంధించి గడువును సుప్రీంకోర్టు నిరవధికంగా పొడగించింది. ఈ కేసు విచారణ పూర్తయ్యేంతవరకు ఆధార్ నంబరు అనుసంధాన ప్రక్రియను తప్పనిసరి చేయరాదని స్పష్టంచేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. 
 
గతేడాది డిసెంబరు 15న బ్యాంకు ఖాతాలు, మొబైల్ నెంబర్లతో ఆధార్ అనుసంధానానికి తుది గడువును సుప్రీంకోర్టు ఈ నెలాఖరు వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. దీనిపై మరోమారు విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఈ మధ్యంతర తీర్పు ఆధార్‌ రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై తుది తీర్పును వెలువరిచేంతవరకు అమల్లో ఉంటుందని బెంచ్ తెలిపింది. 'చివరికి తత్కాల్ పాస్‌పోర్టు జారీకి కూడా ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరిగా కోరరాదు' అని స్పష్టంచేసింది.
 
ముఖ్యంగా, ఈనెలాఖరుతో బ్యాంకు ఖాతాలు, మొబైల్ నెంబర్లతో 'ఆధార్' అనుసంధాన గడువు ముగియనుంది. దీన్ని సుప్రీంకోర్టు మంగళవారం నిరవధికంగా పొడిగించింది. సబ్సిడీ ఇవ్వడానికి తప్ప మిగిలిన వాటికి ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని డిమాండ్ చేయొద్దని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments