ఆధార్ కార్డులో సవరణలు.. ఇకపై సేవా కేంద్రాలకు వెళ్లనక్కర్లేదు.. ఇంటి నుంచే మార్పులు

సెల్వి
మంగళవారం, 9 డిశెంబరు 2025 (15:14 IST)
ఆధార్ కార్డు వినియోగదారులకు శుభవార్త. ఆధార్ కార్డులోని వివరాలను సవరించుకోవడానికి ఇకపై సేవా కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా, ఇంట్లో నుంచే మార్పులు చేసుకునేందుకు వీలుగా ఒక కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీతో పనిచేసే ఈ యాప్ ద్వారా కీలకమైన వివరాలను సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. 
 
మొబైల్ నంబర్‌తో పాటు పేరు, చిరునామా, ఈ-మెయిల్ ఐడీ వంటి ఇతర వివరాలను మార్చుకునే సదుపాయాలు కూడా ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని, త్వరలోనే వాటిని కూడా అందుబాటులోకి తెస్తామని యూఐడీఏఐ అధికారులు తెలిపారు. ఈ కొత్త విధానంతో ఆధార్ కేంద్రాలపై భారం తగ్గి, ప్రజలకు సేవలు మరింత వేగంగా అందనున్నాయి.
 
ప్రస్తుతం ఈ కొత్త యాప్‌లో మొబైల్ నంబర్‌ను మార్చుకునే సదుపాయాన్ని యూఐడీఏఐ లైవ్ చేసింది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, ఫేస్ అథెంటికేషన్ ద్వారా తమ గుర్తింపును ధ్రువీకరించుకోవాలి. ఆ తర్వాత రూ. 75 ఫీజు చెల్లించి కొత్త మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ కోసం రిక్వెస్ట్ పంపవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సుమారు 30 రోజుల్లోగా కొత్త నంబర్ ఆధార్‌తో లింక్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Ravi Teja: అద్దం ముందు.. పాటలో రవితేజ, డింపుల్ హయతి

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments