Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది... ఒకడి హత్య, మరొకడ్ని పట్టించింది...

Webdunia
సోమవారం, 28 జులై 2014 (15:20 IST)
వివాహేతర సంబంధం కారణంగా తమిళనాడుకు చెందిన యువకుడు హత్యకు గురయ్యాడు. అంతేకాదు... అతడి మృతదేహాన్ని కడప అటవీ ప్రాంతంలో పెట్రోలు పోసి దగ్ధం చేసి నిప్పంటించి బూడిద చేశారు. ఐతే నిజం నిప్పులాంటిది కదా. వెలుపలికి వచ్చింది. 
 
వివరాలను చూస్తే... తిరువొత్తియూరుకు చెందిన 27 ఏళ్ల పుష్పరాజ్ రూప్ టెక్ అనే రూప్ టాప్ ఏర్పాటు చేసే సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతడికి అదే కంపెనీలో పనిచేస్తున్న ఆపరేటర్ సుజాతతో పరిచయమేర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఐతే అప్పటికే సుజాత సంస్థ యజమాని సదాశివంతో కూడా లైంగిక సంబంధాన్ని కలిగి ఉంది.
 
దీనితో సుజాతతో సన్నిహితంగా ఉన్నట్లు తెలుసుకున్న సదాశివం విక్కీని మందలించాడు. ఐనప్పటికీ అతడు సదాశివం బెదిరింపులను లెక్కచేయకుండా యధావిధిగా సుజాతతో సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. దీంతో విక్కీని ఉద్యోగం నుంచి పీకిపారేశాడు సదాశివం. ఐనప్పటికీ విక్కీ బయటకు వెళ్లినప్పటికీ సుజాతను వదల్లేదు. 
 
దాంతో ఆగ్రహానికి గురయిన సదాశివం చెన్నైలోని చాకలిపేటలో ఓ కిరాయి ముఠాతో మాట్లాడి, విక్కీని హత్య చేస్తే 8 లక్షల రూపాయలిస్తానని చెప్పి, అనుకున్నది అనుకున్నట్లుగా చేయించేశాడు.. కిరాయి ముఠా విక్కీని కిడ్నాప్ చేసి ఆంధ్రప్రదేశ్ కడప వైపు తీసుకెళుతూ మార్గమధ్యంలో అతడి గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని అడవిలోకి తీసుకెళ్లి పెట్రోలు పోసి నిప్పంటించి తగులబెట్టారు. 
 
మరోవైపు విక్కీ అదృశ్యం కావడంతో ప్రేమికురాలు సుజాతకు అనుమానమొచ్చింది. విక్కీ ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల వద్ద ఆరా తీస్తే తమ బిడ్డ కనబడటం లేదని వారు బోరున విలపించారు. దాంతో ఆమె సదాశివంపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు సదాశివం వద్ద తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు విషయం వెలుగుచూసింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి