Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాధేయపడింది.. అలిగింది.. పుట్టింటికెళ్లింది.. తీరుమారలే... దాన్ని కోసిపారేసింది.

ఇది మామూలు మహిళ చేసే పని కాదు. సతీ సావిత్రిలు, సక్కూబాయిలు పుట్టిన దేశంలో ఉగ్రకాళి అవతారమెత్తిన భారతీయ మహిళ తీసుకున్న కఠిననిర్ణయం. ఫలితం భర్త మర్మాంగం తెగి కిందపడింది. బీభత్సం, ఘాతుకం, ఘోరం, క్రూరం, ద

Webdunia
శనివారం, 22 జులై 2017 (02:52 IST)
ఇది మామూలు మహిళ చేసే పని కాదు. సతీ సావిత్రిలు, సక్కూబాయిలు పుట్టిన దేశంలో ఉగ్రకాళి అవతారమెత్తిన భారతీయ మహిళ తీసుకున్న కఠిననిర్ణయం. ఫలితం భర్త మర్మాంగం తెగి కిందపడింది. బీభత్సం, ఘాతుకం, ఘోరం, క్రూరం, దారుణం ఇలాంటి పదాలకు ఆమె చేసిన చర్యను వర్ణించలేవు. వివాహబంధం ఒక అసహ్యబంధంగా మారిన క్షణాల్లో ఆమె భర్త హింసకు తాళలేక, ఓపిక నశించి తీసుకున్న నిర్ణయం ఇది. పోలీసులు అరెస్టు చేసి ఉండవచ్చు కానీ ఆమె చేసింది తప్పని న్యాయస్థానం తీర్పివ్వగలదా. అలా తీర్పు చెప్పినట్లయితే జీవితమంతా ఆమె పడిన బాధలకు, హింసలపై కూడా తీర్పు చెప్పగలదా?
 
తమిళనాడులోని గుడియట్టాంలో చోటుచేసుకుందీ ఘటన. వివాహేతర సంబంధాలు వద్దు అని ఆమె తన భర్తను ప్రాధేయపడింది! కొన్నాళ్లు అలిగి పుట్టింటికీ వెళ్లింది. అయినా అతడి తీరులో మార్పురాకపోవడంతో తీవ్ర నిర్ణయమే తీసుకుంది. ఒకానొక రాత్రి భర్త ఆదమరచి నిద్రిస్తున్నవేళ అతడి మర్మాంగాన్ని చాకుతో కోసివేసింది. దాన్ని తన పర్సులో పెట్టుకొని అదేరాత్రి పుట్టింటికి పారిపోయింది! 
 
పోలీసుల వివరాల ప్రకారం.. గుడియాత్తంకి చెందిన జగదీశం, సరసు దంపతులు. 14 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు. మనస్పర్థలు రావడంతో ఏడాది క్రితం సరసు తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. అప్పటి నుంచి పిల్లలంతా నాన్నమ్మ వాళ్లింట్లోనే ఉంటున్నారు. జూలై 17న పెద్ద కొడుకు పుట్టిన రోజు కావడంతో అబ్బాయి కోరికను మన్నించి మళ్లీ భర్త దగ్గరకు వచ్చిందామె. 
 
బుధవారం రాత్రి తప్పతాగి ఇంటికి వచ్చిన జగదీశం.. భార్య సరసుతో గొడవ పెట్టుకున్నాడు. నానా యాగీ చేసి అర్ధరాత్రి పడుకున్నాడు. దీంతో ఆగ్రహించిన సరసు కత్తితో జగదీశం మర్మాంగాన్ని కోసివేసి, పుట్టింటికి వెళ్లిపోయింది. జగదీశం కేకలు విని పరుగెత్తుకు వచ్చిన ఇరుగుపొరుగూ హుటాహుటిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సరసును శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
మగాడి ధాష్టీకానికి, హింసోన్మాదానికి, గృహహింసకు రిపేర్ చేయలేక ఓడిపోయిన ఆ మహిళ అతగాడి మర్మాంగాన్ని కోసిపడేసిన ఘటన కొత్తదేమీ కాదు. 20 ఏళ్ల క్రితం అమరికాలో లోరెనా బాబిట్ అనే మహిళ తన భర్త తనను పెడుతున్న హింసలను భరించలేక ఒక రాత్రి పూట అతగాడి మర్మాంగాన్ని కోసిపడేసి పోలీస్ స్టేషనమ్‌కు వెళ్లి విషయం చెప్పేసింది. అమెరికా సమాజాన్ని రెండుగా చీల్చేసిన ఘటన అది. మహిళలు, పురుషులు రెండుగా చీలిపోయి సమాజంలోనూ, కోర్టులోనూ వాదులాడిన ఘటన అది. అమెరికా న్యాయస్తానం ఆమెకు శిక్ష వేయకుండా వదిలేసింది. 
 
అప్పటినుంచి మగాడి మర్మాంగాన్ని కోసిపడేసే చర్యకు బాబిటైజేషన్ అనే పదంతో పిలుస్తున్నారు. లోరెనా బాబిట్ చేసిన పనిగా అది డిక్షనరీల్లో కూడా వెళ్లిపోయింది. ఇప్పుడీ తమిళ మహిళ చేసిన చర్యకు భారతీయ న్యాయస్థానాలు ఏ తీర్పు విధిస్తారో చూడాలి. అమెరికాలో లోరెనా బాబిట్ కత్తి వేటుకు మర్మాంగం తెగిపడిన ఆ మగాడు ఎలాగోలా దాన్ని అపరేషన్ చేయించుకుని మళ్లీ పెళ్లి చేసుకుని మరొకామెను కూడా అలాగే హింసిస్తూ పోయాడని అప్పట్లో అమెరికన్ పత్రికలు కోడైకూశాయి
 
మగాడి మర్మాంగాన్ని కాదు.. మగాడి ధాష్టీకాన్ని, హింసోన్మాదాన్ని కోసి పడేసే సమాజం వస్తే ఎంత బావుణ్ణో మరి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం