Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మరక ఏంటి? పీరియడ్‌లో వున్నావా? టీచర్ షేమ్-విద్యార్థిని..?

ప్రకృతి సిద్ధంగా మానవులు, జంతువులు, క్రిమికీటకాదులు, వృక్ష జాతులకు కొన్ని లక్షణాలు, గుణాలు వుంటాయన్నది తెలిసిందే. మానవుల్లో... ముఖ్యంగా రజస్వల అయిన అమ్మాయిలు ప్రతి 28 రోజులకు ఒకసారి బహిష్టు అనేది వుంటుందన్నదీ తెలిసిందే. ఐతే ఇదే ఓ బాలిక ప్రాణం తీసింది

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (13:40 IST)
ప్రకృతి సిద్ధంగా మానవులు, జంతువులు, క్రిమికీటకాదులు, వృక్ష జాతులకు కొన్ని లక్షణాలు, గుణాలు వుంటాయన్నది తెలిసిందే. మానవుల్లో... ముఖ్యంగా రజస్వల అయిన అమ్మాయిలు ప్రతి 28 రోజులకు ఒకసారి బహిష్టు అనేది వుంటుందన్నదీ తెలిసిందే. ఐతే ఇదే ఓ బాలిక ప్రాణం తీసింది.
 
వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలికి చెందిన 12 ఏళ్ల బాలిక పాఠశాలకు వెళ్లింది. ఐతే ఆమెకు క్లాసులోనే రుతుస్రావం కావడంతో తీవ్ర కడుపునొప్పితో నలతగా కూర్చుంది. ఇది గమనించిన మహిళా టీచర్ ఆమెను నిలబెట్టి తేరిపార చూసింది. ఏంటీ... వెనుక ఆ రక్తపు మరక ఏంటి? పీరియడ్ లో వున్నావా? బుద్ధి లేదా అంటూ మందలించి ఆమెను క్లాసు బయట నిలబడాలని పనిష్మెంట్ ఇచ్చింది. 
 
సాయంత్రం వరకూ ఆ బాలికను అలాగే నిలబెట్టేసింది. ఒకవైపు కడుపునొప్పి ఇంకోవైపు నీరసంతో ఆ బాలిక పాఠశాల ముగిశాక ఇంటికి వెళ్లి తన తల్లి వద్ద బోరున విలపించింది. తనను అంతమంది విద్యార్థినీవిద్యార్థుల మధ్య తన టీచర్ అవమానించిందంటూ ఆవేదన చెందింది. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ లెటర్లో మాత్రం తన ఉపాధ్యాయురాలి పేరు పేర్కొనకుండా తనకు జరిగిన అవమానం మాత్రమే రాసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments