Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక దాడి జరిగిందని చెప్పినా వినలేదు.. చెవి కొరికి చేత బట్టుకుని...

లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. బాధితురాలు తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి చెవిని చేతబట్టుకుని పోలీసుల వద్దకు వెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోండా అనే ప్రాంత

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (11:46 IST)
లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. బాధితురాలు తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి చెవిని చేతబట్టుకుని పోలీసుల వద్దకు వెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోండా అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. లైంగిక దాడి జరిగిందని చెప్పినా పట్టించుకోని పోలీసులు... ప్రత్యక్ష సాక్ష్యంగా కొరికిన చెవిని తీసుకురావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే గత సోమవారం తన పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై నలుగురు వ్యక్తులు లైంగికదాడికి దిగారు. ఇంటి బయట ఉన్న గదిలో ఆమె భర్త.. భార్య కేకలు విని ఇంట్లోకి పరిగెత్తుకొచ్చాడు. దీంతో, మిగిలిన ముగ్గురు అతడిపై తీవ్రంగా దాడి చేస్తుండగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్న వ్యక్తి చెవిని బాధితురాలు కొరికిపారేసింది.
 
ఆ తర్వాత వారు జరిగిన విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించి వెళ్లిపోయారు. ఈ మేరకు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా రెండు రోజులపాటు స్థానిక పోలీసులు కేసు నమోదుచేసుకోలేదు. దీంతో బాధితురాలు ఏం చేయాలో పాలుపోక.. నిందితుడి చెవిని కొరికిన విషయం గుర్తుకుతెచ్చుకొని ఆ భాగాన్ని తీసుకొని నేరుగా ఎస్‌పి కార్యాలయానికి చేరింది. దీంతో ఎస్పీ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం