Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక చాలు.. రాజకీయాలకు రాం రాం: సోనియా గాంధీ ప్రకటన

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయాలకు స్వస్తి చెప్పనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తాను రిటైర్ అవుతున్నానని పార్లమెంట్ నుంచి బయటకు వెళ్తూ సోనియా గాంధీ మీడియాతో వెల్లడించారు.

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (13:25 IST)
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయాలకు స్వస్తి చెప్పనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తాను రిటైర్ అవుతున్నానని పార్లమెంట్ నుంచి బయటకు వెళ్తూ సోనియా గాంధీ మీడియాతో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శనివారం రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాల నుంచి సోనియా గాంధీ తప్పుకోనుండటంతో పాటు రాజకీయాలకు దూరంగా వుంటూ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. 
 
శుక్రవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలకు హాజరైన సోనియా గాంధీ.. సభ వాయిదాకు అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైందని.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. 
 
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో పార్టీలో మీ పాత్ర ఎలా వుంటుందనే ప్రశ్నకు సోనియా గాంధీ.. తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోనున్నట్లు తెలిపారు.
 
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణానికి అనంతరం ఏడేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా వున్న ఇందిరమ్మ కుటుంబానికి.. సోనియా గాంధీ అన్నీ తానై నిలిచి.. రాజకీయాల్లోకి వచ్చారు. ఆపై 19 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధినేత్రిగా సోనియా బాధ్యతలు చేపట్టారు. తద్వారా ఎక్కువకాలం పార్టీ బాధ్యతలు నిర్వర్తించిన అధినేత్రిగా ఆమె రికార్డ్ సృష్టించారు.
 
సోనియా గాంధీ 1946 డిసెంబర్ 9న ఇటలీలో జన్మించారు. 1998 మార్చి 14న పార్టీ బాధ్యతలు స్వీకరించారు. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ నాయకులు ప్రధాని పదవి తీసుకోమని చెప్పగా నిరాకరించారు. ఆ తర్వాత ఐదేళ్లకు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1998లో పార్టీ చీఫ్ అయ్యారు. 2004లో లోకసభలో యూపీఏకు అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments