Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో బలవంతపు శృంగారం చేస్తే... విడాకులు ఇవ్వాల్సిందే..

జీవిత భాగస్వామితో ఇష్టం లేకుండా బలవంతపు శృంగారం, అసహజ శృంగారం చేస్తే విడాకులకు ప్రాతిపదికేనని పంజాబ్‌, హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని ఒక మహిళ చేసిన విజ్ఞప్తిపై మన్నించింది. తన భర్త అతని కోర్కె తీర్చుకోవడం కోసం త

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (13:13 IST)
జీవిత భాగస్వామితో ఇష్టం లేకుండా బలవంతపు శృంగారం, అసహజ శృంగారం చేస్తే  విడాకులకు ప్రాతిపదికేనని పంజాబ్‌, హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని ఒక మహిళ చేసిన విజ్ఞప్తిపై మన్నించింది. తన భర్త అతని కోర్కె తీర్చుకోవడం కోసం తనను తరచూ హింసించేవాడని, అసహజ లైంగిక చర్యలకు పాల్పడేవాడని ఆమె ఆరోపించింది.
 
ఆమె విజ్ఞప్తిని దిగువ న్యాయస్థానం తోసిపుచ్చగా హైకోర్టును ఆశ్రయించింది. అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడినట్లు రుజువు చేయలేకపోయారన్న దిగువ న్యాయస్థానం అభిప్రాయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. బలవంతపు శృంగారం, అసహజ శృంగారం చేస్తే  విడాకులకు ప్రాతిపదికేనని ఈ కేసులో హైకోర్టు తీర్పు ఇచ్చింది.
 
తాజా ఈ తీర్పుతో మహిళా సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. పెళ్లి ముసుగులో ఆడవారిపై ఇష్టం లేకుండా మ్యారిటల్ రేప్‌లు జరుగుతున్నాయని పేర్కొంటున్నాయి. ఇప్పటికైనా మగవారి ఆలోచనలో మార్పులు రావాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం