Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సైనిక సామర్థ్యం - సాంస్కృతిక వైభవం.. ఘనంగా రిపబ్లిక్ పరేడ్

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (09:22 IST)
భారత 73వ గణతంత్ర వేడుకలు యావత్ భారతావనిలో ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లు పూర్తయ్యాయి. దీంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో వేడుకలు జరుగుతున్నాయి. మరోవైపు భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించి 73 యేళ్లు పూర్తయ్యాయి. దీంతో భారత సైనిక సామర్థ్యాన్ని, దేశ సాంస్కృతి వైభవాన్ని చాటిచెప్పేలా రాజ్‌పథ్ వద్ద రిపబ్లిక్ పరేడ్‌ను రక్షణ శాఖకు చెందిన త్రివధ దళాలు నిర్వహించాయి. 
 
తొలుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గౌవర వందనం స్వీకరించారు. ఆ తర్వాత ప్రధాన కార్యక్రమంలో 16 కవాతు విభాగాలు పాలుపంచుకున్నాయి. సైన్యం, నౌకాదళం, వాయుసేన, కేంద్ర పారామిలటరీ దళాలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాలు భాగస్వామ్యంతో ఈ పరేట్ నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 విమానాలతో భారత వాయుసేన విన్యాసాలను ప్రదర్శించింది. ఇందులో అత్యాధునికమైన రఫేల్, సుఖోయ్, జాగ్వర్, అపాచీ వంటి యుద్ధ విమానాలు పాలుపంచుకున్నాయి.
 
అదేవిధంగా ఈ గణతంత్ర వేడుకల్లో మొత్తం 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలతో కవాతు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన శకటాలకు ఈ దఫా చోటు దక్కలేదు. ఈ వేడుకల్లో తొలిసారి 480 మంది కళాకారులతో వివిధ రకాలైన సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా వందే భారత్ డ్యాన్స్ పోటీలను కూడా నిర్వహించి ఈ సాంస్కృతిక కళా పోటీలకు కళాకారులను ఎంపిక చేయడం గమనార్హం. 
 
అదేసమయంలో కోవిడ్ నేపథ్యంలో పలు కఠిన ఆంక్షలు అమలు చేశారు. దీంతో ఈ పరేడ్‌ను వీక్షించే వారి సంఖ్యను బాగా కుదించారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న పెద్దలు, ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న 15 యేళ్ల పైబడిన చిన్నారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే, భౌతిక దూరం పాటించేలా సీటింగ్‌ను ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులను ఆహ్వానించలేదు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments