Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 ఏళ్ల వయసులో నీకు 25 ఏళ్ల యువతి కావాలా? వృద్ధ కోటీశ్వరుడిపై సెటైర్లు

ఆయనకు 70 ఏళ్లు. భార్య చనిపోయింది. ఆయన పిల్లలకు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. కానీ కోట్ల రూపాయల ఆస్తి... చిటికేస్తే నౌకర్లు, కార్లు వచ్చేస్తాయి. కానీ తనకు మాత్రం మరో ఆలోచన వచ్చింది. మరణించేవరకూ తనకు తోడుగా వుండేందుకు ఓ స్త్రీ కావాలని నిర్ణయించుకున్నాడు. ఆల

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (11:13 IST)
ఆయనకు 70 ఏళ్లు. భార్య చనిపోయింది. ఆయన పిల్లలకు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. కానీ కోట్ల రూపాయల ఆస్తి... చిటికేస్తే నౌకర్లు, కార్లు వచ్చేస్తాయి. కానీ తనకు మాత్రం మరో ఆలోచన వచ్చింది. మరణించేవరకూ తనకు తోడుగా వుండేందుకు ఓ స్త్రీ కావాలని నిర్ణయించుకున్నాడు. ఆలోచనైతే బాగానే వుంది కానీ ఆయన చేసిన పనిపైనే ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. 
 
వివరాల్లోకి వెళితే... అస్సాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజేష్ కుమార్. ఆయన తనకంటే వయసులో 45 ఏళ్ల చిన్నదైన యువతిని పెళ్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో కలిసి వున్న ఫోటోను సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఆ ఫోటోపై నెటిజన్లు కామెంట్ చేస్తూ పెద్దాయన తప్పు చేశారని పేర్కొంటున్నారు. 
 
70 ఏళ్ల వయసులో 25 ఏళ్ల యువతిని పెళ్లాడి ఆమె జీవితాన్ని నాశనం చేశావని తిడుతున్నారు. పెళ్లాడాలని వుంటే విడాకులు తీసుకున్న మహిళనో లేదంటో నీ వయసుకు ఐదారేళ్లు తేడా వున్న మహిళనో పెళ్లాడవచ్చు కదా. యువతి గొంతు కోశావు అంటూ మండిపడుతున్నారు. మరికొందరైతే ఆ 70 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిని యువతి కేవలం అతడి కోట్ల ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నదనీ, అంతేతప్ప మరొకటి కాదని పోస్ట్ చేస్తున్నారు. 
 
అంతేకాదు ఆయనకు సన్నిహితంగా వున్న ఓ కుటుంబం కూడా ఆయన చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజేష్ అంకుల్ చేసిన పని ఏమాత్రం బాగాలేదు. ఆయన కోడలు కంటే చిన్న వయసు వున్న యువతిని పెళ్లి చేసుకుని ఏం చేయాలని. ఆయన నిర్ణయం ఎంతమాత్రం సమంజసం కాదు. దేశంలో ఎందరో ఆదరణ లేని మహిళలు వున్నారనీ, అలాంటివారిలో ఎవరినో ఒకరిని తన వయసుకు తగినవారిని పెళ్లాడి వుంటే బావుండేదని పేర్కొన్నారు. మరి ఈ వృద్ధ వ్యాపారవేత్త నిర్ణయంపై మీరేమనుకుంటున్నారు?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్షమించమని అడక్కుండా రాజకీయాలకు స్వస్తి చెప్తే సరిపోదు: పోసానిపై నిర్మాత

అతివృష్టి లేదంటే అనావృష్టి : ఈ శుక్రవారం ఏకంగా 10 చిత్రాలు విడుదల...

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments