కారులో ఊపిరాడక మరణించిన బాలుడు.. నాలుగు రోజుల తర్వాతే గుర్తించారు.. ఎక్కడ?!
గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఘోరం జరిగింది. అపార్ట్‌మెంట్లలో ఉండే తల్లిదండ్రులు ఆ బిడ్డను ఆడుకుంటున్నాడని తేలిగ్గా వదిలేశారు. ఫలితం చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఘోరం జరిగింది. అపార్ట్‌మెంట్లలో ఉండే తల్లిదండ్రులు ఆ బిడ్డను ఆడుకుంటున్నాడని తేలిగ్గా వదిలేశారు. ఫలితం చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
వివరాల్లోకి వెళితే.. కారులోపల పొరపాటున తాళం పడి ఊపిరాడక ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సూరత్ నగరంలో గల ఒక అపార్ట్‌మెంట్లో నిలిపివుంచిన కారులోకి ప్రవేశించిన ఆ బుడతడు.. ఆట్లాడుతూ.. కారు తలుపుల్ని లాక్ చేసుకున్నాడు.
ఆపై ఆ డోర్లను తీయడం అతనికి వీలుకాలేదు. కారు అద్దాలు సైతం మూసేసి వుండటంతో లోపల చిక్కుకున్న ఆ కుర్రాడు ఊపిరాడక మరణించాడు. ఆడుకుంటున్న తమ బిడ్డ ఇలా మృత్యువు బారిన పడటం చూసిన అతని తల్లితండ్రులు రోధించారు. హృదయవిదారకమైన ఈ సంఘటన అక్కడి నిఘా కెమేరాలో రికార్డైంది.
అయితే.. ఆడుకుంటున్న తమ బిడ్డ కనిపించలేదని జూన్ 13వ తేదీ సూరత్‌లోని సచిన్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. కానీ పార్కింగ్ ఏరియాలో నిల్చున్న కారు నుంచి దుర్వాసన రావడంతో జై వైభవ్ విల్లా అపార్ట్‌మెంట్ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారు తెరిచి చూస్తే బాలుడి మృతదేహం కుళ్ళిన స్థితిలో లభ్యమైంది.
ఆ బాలుడు తమ బిడ్డేనని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన తల్లిదండ్రులు విలపించారు. అనంతరం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాకే కారులోకి తెలియకుండా ప్రవేశించిన బాలుడు డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు.