Webdunia - Bharat's app for daily news and videos

Install App

జలుబు, జ్వరాలకు విక్రయించే 59 మందులు నాసిరకం

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (11:34 IST)
జలుబు, జ్వరాలకు విక్రయించే 59 రకాల మందులు నాణ్యత లేనివని కేంద్ర ఔషధ నియంత్రణ మండలి తెలియజేసింది. కేంద్ర- రాష్ట్ర ఔషధ నాణ్యత నియంత్రణ బోర్డులు భారతదేశం అంతటా విక్రయించే ఫార్మాస్యూటికల్ మాత్రలపై నాణ్యత నియంత్రణ తనిఖీలను నిర్వహిస్తున్నాయి. 
 
ఈ తనిఖీల్లో నకిలీ లేదా నాసిరకం మందులు దొరికితే సంబంధిత కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ పరిస్థితిలో గత ఫిబ్రవరిలో 1251 మందులను పరిశీలించగా అందులో 59 మందులు నాసిరకంగా ఉన్నాయని గుర్తించి జలుబు, జ్వరానికి ఇస్తున్నట్లు గుర్తించారు. 
 
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మందులు ఎక్కువగా తయారవుతున్నాయని గుర్తించారు. నాసిరకం మందుల వివరాలను సెంట్రల్‌ డ్రగ్‌ క్వాలిటీ కంట్రోల్‌ బోర్డు వెబ్‌సైట్‌లో ప్రచురించామని, సంబంధిత కంపెనీలపై తగిన చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ మండలి అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయలసీమ ప్రేమకథలో అఖిల్ అక్కినేని.. డైరక్టర్ ఎవరంటే?

డాక్టర్‌ను రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ దర్శకుడు.. ఎవరు?

డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి.. నెట్టింట ఫోటోలు వైరల్

నేను ఏదో ఒక రోజు తల్లిని కావాలని ఎదురు చూస్తున్నాను- సమంత

యంగ్ జనరేషన్‌ కోసం 'దిల్ రాజు డ్రీమ్స్' పేరుతో కొత్త బ్యానర్ : దిల్ రాజు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments