Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో చక్కా జామ్ వద్ద ఆందోళన చేపట్టలేదు.. రైతు సంఘాలు

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (10:07 IST)
దేశ రాజధాని ఢిల్లీలో చక్కా జామ్ వద్ద ఆందోళన నిర్వహించడం లేదని రైతులు పేర్కొన్నారు. ఢిల్లీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో రహదారుల దిగ్బంధం కానీ చక్కా జామ్ లాంటి నిరసనలు చేపట్టడంలేదని రైతు సంఘాలు పేర్కొన్నాయి. అయితే దేశవ్యాప్తంగా మాత్రం శాంతియుత పద్ధతిలో జాతీయ రహదారులపై నిరసనలు కొనసాగనున్నాయి. 
 
అంబులెన్సులు, స్కూల్ బస్సులను చక్కా జామ్‌లో భాగంగా అడ్డుకోవడం లేదని సంయుక్తి కిసాన్ మోర్చా పేర్కొంది. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ మినహా మిగితా దేశమంతా చక్కా జామ్ ఉంటుందని భారతీయ కిసాన్ యూనిన్ నేత రాకేశ్ తికయిత్ తెలిపారు. 
 
కొందరు హింసకు పాల్పడే అవకాశం ఉన్నందున ఈ మూడు రాష్ట్రాల్లో బంద్‌ను వాయిదా వేసినట్లు చెప్పారు. ఢిల్లీలోని సింఘు, తిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల్లో గత 70 రోజుల నుంచి రైతుల ఆందోళన చేస్తున్నారు. రైతుల ఆందోళన చేస్తున్న ప్రాంతాలు మినహా ఢిల్లీలో ఎక్కడా చక్కా జామ్ ఉండదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.
 
మరోవైపు 50 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఘటనలను పునరావృత్తం కాకుండా ఉండేందుకు భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ, రిజర్వ దళాలు.. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. 12 మెట్రో స్టేషన్ల వద్ద అప్రమత్తత ప్రకటించారు. పలు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పోలీసులు నిఘా పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments