ఒరిస్సా ఆస్పత్రిలో విషాదం.. ఇంజెక్షన్ వికటించి ఐదుగురు మృతి

ఠాగూర్
బుధవారం, 4 జూన్ 2025 (10:54 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా కేంద్రంలో ఉన్న సహీద్ లక్ష్మమ్ నాయక్ వైద్య మెడికల్ కాలేజీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంజెక్షన్ వికటించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం అర్థరాత్రి కొన్ని గంటల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. వైద్య సిబ్బంది ఇచ్చిన తప్పుడు ఇంజెక్షన్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని మృతుల కుటుంబూ సభ్యులు ఆరోపిస్తున్నాయి. 
 
ఐసీయూ, సర్జికల్ వార్డులలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఐదుగురు వ్యక్తులు గత రాత్రి మరణించారు. అంతకు ముందు కొన్ని నిమిషాల ముందు ఆస్పత్రి సిబ్బంది వీరికి రెండో విడత ఇంజెక్షన్లు ఇచ్చినట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
అర్థరాత్రి సమయంలో ఒక నర్సు మా పక్కనే ఉన్న ముగ్గురు రోగులకు ఇంజెక్షన్ ఇచ్చింది. మా సోదరీకి కూడా అదే ఇంజెక్షన్ వేసింది. అది వేసిన కొన్ని గంటల్లోనే ఆమె తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోయింది. మేము డాక్టర్‌ను పిలిచి, ఆయన వచ్చి పరీక్షించేలోపు ఆమె ప్రాణాలు విడిచింది అని బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments