Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు గ్యాంగ్ రేప్.. మర్మాంగంలో బాటిల్‌తో దాడి.. ఆరుగురి అరెస్ట్

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (10:02 IST)
కర్నాటక రాజధాని బెంగుళూరులో ఓ మహిళను వేధించిన గ్యాంగ్‌.. ఆ తర్వాత సామూహిక రేప్‌కు పాల్పడ్డారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఈ కేసులో ఆరుగుర్ని అరెస్టు చేశారు. దాంట్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. 
 
సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వీడియోపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. నిందితులు ఓ మహిళను అతి క్రూరంగా వేధించారు. ఆమె మర్మాంగాల్లో బాటిల్‌తో దాడి చేశారు. ఆ తర్వాత 22 ఏళ్ల ఆ యువతిని గ్యాంగ్ రేప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆరు రోజుల క్రితం ఈ ఘటన బెంగుళూరులో జరిగినట్లు తెలుస్తోంది. అయితే వీడియో క్లిప్ ఆధారంగా అనుమానితుల్ని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
 
అత్యాచారానికి గురైన మహిళతో పాటు నిందితులంతా ఒకే గ్రూపుకు చెందినట్లు పోలీసులు గుర్తించారు. వారంతా బంగ్లాదేశీలు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక అంశంలో విబేధాలు రావడంతో.. ఆ క్రూరత్వానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. 
 
బంగ్లాదేశీ మహిళను అత్యంత అమానవీయంగా వేధించారు. అక్రమరీతిలో ఆ మహిళను ఇండియాకు తీసుకువచ్చినట్లు కూడా గుర్తించారు. ప్రస్తుతం ఆ మహిళ మరో రాష్ట్రంలో ఉన్నదని, ఆమెను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. మెజిస్ట్రేట్ వద్ద ఆమె వాంగ్మూలం తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.
 
గ్యాంగ్ రేప్ ఘటనపై తీవ్ర ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఈశాన్య రాష్ట్రాలు ఆ రేప్ ఘటనను తీవ్రంగా పరిగణించారు. వీడియోలో ఉన్న బాధితురాలు అస్సామీ ప్రాంతానికి చెంది ఉంటుందని భావించారు. దీనిపై అస్సామీ పోలీసులు కూడా సమాచారం సేకరిస్తున్నారు. 
 
అరెస్టు అయిన వారిలో మహమ్మద్ బాబా షేక్‌, రిఫాతుల్ ఇస్లామ్ రిదే బాబో, సాగర్‌, అఖిల్‌లు ఉన్నారు. మహిళ ఐడెంటిటీని పోలీసులు వెల్లడించలేదు. నిందితులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు అని అనుమానిస్తున్నారు. బాధితురాలు ఢాకాకు చెందినట్లు అక్కడి పోలీసులు తేల్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

Niharika: సంగీత్ శోభన్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం