Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదం.. 47మంది మృతి.. రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయాల పాలైయ్యారు. వారిని సహాయక సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై సమాచా

Webdunia
ఆదివారం, 1 జులై 2018 (14:07 IST)
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయాల పాలైయ్యారు. వారిని సహాయక సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ 30 మృతదేహాలను బస్సు నుంచి వెలికితీశారు.
 
ఆదివారం పౌరిగల్వార్‌ జిల్లా నానిదండ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. 45మంది ప్రయాణికులతో రామ్‌ నగర్‌ నుంచి బస్సు భోహన్‌‌కు బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 
 
మృతుల్లో 28 మంది రామ్‌నగర్‌కు చెందిన వారని గుర్తించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా మృతులకు రూ.2లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేల అందివ్వనున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments