Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 ఏళ్ల బాలికపై 40 మంది గ్యాంగ్ రేప్.. రాత్రిపూట మత్తుమందిచ్చి..?

ఆసియా దేశాల్లో ఒకటైన థాయ్‌లాండ్‌లో ఘోరం జరిగింది. 14 ఏళ్ల బాలిక కామాంధుల చేతుల్లో నలిగిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది పురుషులు ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. థాయ్‌లాండ్‌లోని పంగ్

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (14:53 IST)
ఆసియా దేశాల్లో ఒకటైన థాయ్‌లాండ్‌లో ఘోరం జరిగింది. 14 ఏళ్ల బాలిక కామాంధుల చేతుల్లో నలిగిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది పురుషులు ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. థాయ్‌లాండ్‌లోని పంగ్ ఎన్‌గా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బాధితురాలి తల్లిదండ్రులు కూలి కార్మికులు. రాత్రిపూట పనులకు వెళ్ళిపోతారు. చిన్నారి మాత్రమే ఇంట్లో ఒంటరిగా వుండేది. ఆ సమయంలో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
 
అదే వ్యక్తి వేరొక రోజున చిన్నారిపై అత్యాచారం పాల్పడేందుకు తన స్నేహితులను తీసుకొచ్చాడు. వారందరూ కలిసి చిన్నారికి మత్తుమందిచ్చి అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బయటికి చెప్తే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో తల్లిదండ్రుల వద్ద ఈ విషయాన్ని బాధిత బాలిక దాచేసింది. ఇలా రోజు రోజుకీ చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ఓ బృందం వచ్చి వెళ్లేది. గత ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు ఈ ఘోరం జరిగింది. 
 
ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో విచారణ జరపాల్సిందిగా సదరు  రాష్ట్ర పోలీసులకు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ లైంగిక దాడిని అడ్డుకోవడానికి బాధితురాలే.. తల్లితో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం