Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీపర్ ఉద్యోగాలకు పీజీ గ్రాడ్యుయేట్లు ... 1.7 లక్షల దరఖాస్తులు

ఠాగూర్
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (13:45 IST)
దేశవ్యాప్తంగా నిరుద్యోగ శాతం గత పదేళ్ల కాలంలో విపరీతంగా పెరిగిపోయిందంటూ విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం అలాంటిదేమీ లేదని, ప్రతియేటా భారీ సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తున్నట్టు ఊకదంపుడు ప్రచారం చేస్తున్నారు. వీరికి జాతీయ మీడియా సైతం వంతపాట పాడుతుందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. 
 
ఇపుడు విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపించే ఘటన ఒకటి హర్యానా రాష్ట్రంలో వెలుగు చూసింది. ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లలో స్వీపర్ పోస్టుల భర్తీ కోసం హర్యానా ప్రభుత్వ తాజాగా నోటిఫికేషన్ జారీ చేయగా, ఈ పోస్టుల కోసం పీజీ, యూజీ విద్యార్థులతో పాటు నిరక్ష్యరాస్యులు కూడా పాల్గొన్నారు. దీంతో ఈ పోస్టుల కోసం ఏకంగా సుమారు 1.7 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 
 
దరఖాస్తు చేసిన వారిలో ఉన్నత విద్యావంతులు ఉన్నారు. 6 వేల మందికిపైగా పోస్టు గ్రాడ్యుయేట్లు, సుమారు 40 వేల మంది గ్రాడ్యుయేట్లు అప్లికేషన్లు సమర్పించారు. స్వీపర్‌కు ఇచ్చే నెల జీతం రూ.15 వేలు కావడం గమనార్హం. ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ సంస్థ అయిన హర్యానా కౌశల్ రోజ్ గార్ నిగం లిమిటెడ్ (హెస్‌కెఆర్ఎన్) ఆగస్టు ఆరో తేదీ నుంచి సెప్టెంబరు రెండో తేదీ వరకు స్వీకరించిన ధరఖాస్తుల్లో ఈ విషయం వెల్లడైంది. 
 
పీజీ, బిజినెస్ స్టడీస్‌లో డిప్లొమో చేసిన మనీష్ కుమార్ కూడా ఈ పోస్టు కోసం దరఖాస్తు చేశారు. ప్రైవేటు సంస్థలు, పాఠశాలల్లో నెలకు రూ.10 వేలు మించి ఇవ్వడం లేదని, భవిష్యత్తులో రెగ్యులర్ ఉద్యోగం వస్తుందన్న ఆశ కూడా లేకపోవడంతో ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసినట్టు చెప్పారు. స్వీపర్ అంటే రోజంతా చేయాల్సిన ఉద్యోగం కాదని, ఇతర పనులు చేసుకోవచ్చన్న ఉద్దేశంతో దీనిపై ఆశ పెంచుకున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలితో నా 544వ చిత్రాన్ని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది : అనుపమ్ ఖేర్

పెళ్లి వయస్సు వచ్చింది, దెయ్యంకంటే మనుషులంటే భయం : విశ్వక్ సేన్

Kamal Hassan: మెగాస్టార్ చిరంజీవి కాదు.. రాజ్యసభకు కమల్ హాసన్?

ఫుల్ గడ్డంతో.. తండ్రిలాగే పంచె కట్టి సరికొత్త లుక్‌లో అకీరా నందన్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments