Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో జంట ఎన్‌కౌంటర్లు... నలుగురు ఉగ్రవాదుల హతం!!

encounter
వరుణ్
ఆదివారం, 7 జులై 2024 (08:26 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో వరుసగా రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. ఇందులో నలుగురు ఉగ్రవాదులు చనిపోగా, లాన్స్‌నాయక్ ప్రదీప్ నయన్, హవల్దార్ ప్రదీప్ కుమార్ అనే ఇద్దరు జవానులు వీరమరణం పొందినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని మోడెర్‌గామ్ గ్రామంలో లష్కర్ ఇ తోయిబా ఉగ్రవాదులు దాగివున్నారన్న సమాచారంతో మోడెర్‌గామ్ గ్రామానికి వెళ్లిన భద్రతా బలగాలపై తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రత దళాలు ఉగ్రవాదులు దాగివున్న ఇంటిని చుట్టుముట్టి ప్రతిదాడికి దిగాయి. ఈ క్రమంలో ఆ ఇంటిలో నక్కివున్న ఇద్దరు తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో లాన్స్‌నాయక్ ప్రదీప్ నయన్ అనే జవాను మృతి చెందినట్టు తెలిపారు. 
 
మరోవైపు, ఫ్రిస్కల్ చిన్నిగమ్ గ్రామంలో కూడా ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా బలగాలకు పక్కా సమచారం వచ్చింది. ఈ గ్రామంలో ఓ ఇంట్లో దాగివున్న ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతం కాగా, 01 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన హవల్దార్ రాజ్ కుమార్ అమరుడయ్యారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాలను కాశ్మీర్ ఐజీ వీకే బర్దీ సందర్శించారు. ఉగ్రవాద ఏరివేత చర్యలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments