Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (22:36 IST)
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని ఖోపొలి సమీపంలో ఉన్న ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై జరిగింది. జాతీయ రహదారిపై వాహనాలు రయ్యిరయ్యిన వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒకేసారి ఆరు వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల మధ్య కారు ఇరుక్కుని నుజ్జునుజ్జయింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
ఈ ఘటనలో కారులో ఉన్న ప్రయాణికుల్లో ఇద్దరు మరణించగా.. కోళ్ల వ్యానులో ఉన్న మరొకరు మరణించినట్లు ఖోపోలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శిరీష్ పవార్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కున్న బాధితులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
 
ఈ ఘటన అనంతరం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయిందని.. క్లియర్ చేసేందుకు కొంత సమయం పట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖోపోలి పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments