Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళకు నైరుతి రుతుపవనాలు : ఎండలకు 2005 మంది మృతి!

Webdunia
శనివారం, 30 మే 2015 (11:25 IST)
నైరుతీ రుతుపవనాలు శనివారం కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎండలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో లక్షద్వీప్ మీదుగా గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈ పవనాలు రానున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. 
 
కాగా, గడిచిన 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. భయంకరమైన ఎండ వేడిమికి తాళలేక వడదెబ్బతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 2005 మంది మరణించారని అధికారులు తెలిపారు. శుక్రవారం జార్ఖండ్‌లోని పలమావూ ప్రాంతంలో దేశంలోనే అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో 156 మంది తెలంగాణాలో ఎండలకు 49 మంది మరణించినట్లు తెలుస్తోంది.

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments