Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 23న నేతాజీకి చెందిన మరో 25 రహస్య ఫైళ్లు: మహేశ్ శర్మ

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (18:24 IST)
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన మరో 25 రహస్య ఫైళ్లను విడుదలయ్యే అవకాశం ఉందని సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ వెల్లడించారు. రెండో విడతలో ఫిబ్రవరి 23న సుభాష్‌కు సంబంధించిన మరో 25 రహస్య ఫైళ్లను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. జనవరి 23న నిర్వహించిన నేతాజీ 119వ జయంతి సందర్భంగా వంద రహస్య ఫైళ్లను డిజిటల్ రూపంలో ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేసిన విషయం తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు భారతరత్న, ఆయన జయంతి రోజున సెలవు ప్రకటించడంపై పరిశీలించాలని కేంద్ర హోంశాఖను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు భారతరత్న ప్రదానం చేయడంతోపాటు ఆయన జయంతి రోజు జనవరి 23న సెలవు ప్రకటించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల కేంద్రం నిర్వాహకుడు కేకే రమేశ్‌ న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలుచేశారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments