Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం.. 25 మంది స్కూలు విద్యార్థుల దుర్మరణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహా విషాదం నెలకొంది. రాష్ట్రంలోని ఎటా జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ జిల్లాలోని అలిగంజ్‌లో స్కూల్ పిల్లలతో వెళుతున్న ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు తిరగబడింది. 25 మంది చిన్నారులు ఘటనా స్థలి

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (14:51 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహా విషాదం నెలకొంది. రాష్ట్రంలోని ఎటా జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ జిల్లాలోని అలిగంజ్‌లో స్కూల్ పిల్లలతో వెళుతున్న ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు తిరగబడింది. 25 మంది చిన్నారులు ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో మరో 50 మంది వరకు గాయపడ్డారు. 
 
ఈ చిన్నారులంతా ఎటాలో ఉన్న జేఎస్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థులుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఇది అత్యంత బాధాకర విషయమని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. 
 
ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ...  ద‌ట్ట‌మైన పొగ‌మంచు కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగిందని తెలిపారు. పొగ‌మంచు కార‌ణంగా పాఠ‌శాల‌లు మూసేయాల‌ని స‌ర్కారు ఆదేశాలు జారీ చేసిన‌ప్ప‌టికి స‌ద‌రు స్కూలు ఆదేశాల‌ను ప‌ట్టించుకోలేద‌ని అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు అంటున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments