Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

సెల్వి
మంగళవారం, 6 మే 2025 (23:03 IST)
కర్ణాటకలో రూ.10వేల కోసం పందెం కాసి 21 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. కార్తీక్ తన స్నేహితులతో కలిసి పందెం వేసిన తర్వాత ఐదు బాటిళ్ల మంచి మద్యం తాగాడు. తన స్నేహితులైన వెంకట రెడ్డి, సుబ్రమణి, మరో ముగ్గురికి తాను ఐదు బాటిళ్ల మద్యం తాగుతానని బెట్ కట్టాడు. ఇందుకోసం అతని స్నేహితులు పదివేల రూపాయలు ఇస్తామని పందెం కాశారు. 
 
అయితే, ఆటగా మొదలైనది విషాదంలో ముగిసింది. కార్తీక్ మద్యం తాగిన వెంటనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ తర్వాత 21 ఏళ్ల వ్యక్తిని కోలార్ జిల్లాలోని ముల్బాగల్‌లోని ఆసుపత్రికి తరలించారు. 
 
కానీ చికిత్స పొందుతూ అతను మరణించాడు. కార్తీక్‌కు ఏడాది క్రితం వివాహం అయ్యింది. అతనికి ఎనిమిది రోజుల బిడ్డ కూడా ఉన్నాడు. ఇకపోతే.. వెంకట రెడ్డి, సుబ్రమణి సహా ఆరుగురు వ్యక్తులపై నంగలి పోలీస్ స్టేషన్‌లో పోలీసు కేసు నమోదైంది. ఈ ఘటనపై ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments