జూన్‌ 1 నుండి 200 ప్యాసింజర్‌ రైళ్లు

Webdunia
బుధవారం, 20 మే 2020 (09:17 IST)
వలసకార్మికులను తరలించే శ్రామిక్‌ రైళ్లతో పాటు జూన్‌ 1 నుండి ప్యాసింజర్‌ రైళ్లను కూడా నడపనుంది. వీటికి సంబంధించి టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చని రైల్వేశాఖ తెలిపింది.

ప్రస్తుతం ఉన్న 15 రైళ్లతో పాటు  200 అదనపు రైళ్లలో సెకండ్‌ క్లాస్‌ బోగీలను కూడా అనుమతించినట్లు పేర్కొంది. రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అందుబాటులో ఉంచుతామని రైల్వే శాఖ పేర్కొంది. ఈ నెల 12 నుండి అనుమతించిన 15 ప్రత్యేక రైళ్లు ఎసిబోగీలతో మాత్రమే ప్రయాణించిన సంగతి తెలిసిందే.

అలాగే ప్రయాణికులు మాస్కులు ధరించడం, శానిటైజర్లను వినియోగించడం, భౌతిక దూరం వంటి ఆదేశాలను విధిగా పాటించాల్సిందేనని సూచించింది.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు కేంద్రం ఆదేశించినప్పటికీ, బస్సు సర్వీసులు, ఇతర ప్రజా రవాణాపై నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తుది నిర్ణయాన్ని మాత్రం ఆయా రాష్ట్రాలకే వదిలేసింది. కాగా, లాక్‌డౌన్‌కు ముందు దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 12 వేల రైళ్లు ప్రయాణించేవి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments