Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.100 లంచం ఇవ్వలేదని ఇద్దరు యువకుల్ని కొట్టి చంపేసిన ఖాకీలు!!

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. రూ.100 లంచం ఇవ్వలేదని ఇద్దరు యువకులను పోలీసులు దారుణంగా కొట్టి చంపేశారు. మెయిన్పురి జిల్లా చెక్ పోస్ట్ వద్ద ఈ దారుణం జరిగింది. ఆ వివరాలను పరిశీలిస్తే... దిలీప

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (12:05 IST)
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. రూ.100 లంచం ఇవ్వలేదని ఇద్దరు యువకులను పోలీసులు దారుణంగా కొట్టి చంపేశారు. మెయిన్పురి జిల్లా చెక్ పోస్ట్ వద్ద ఈ దారుణం జరిగింది. ఆ వివరాలను పరిశీలిస్తే... దిలీప్ యాదవ్(22), పంకజ్ యాదవ్(24) ఇద్దరూ మరో ఇద్దరు కార్మికులతో కలిసి ఓ ట్రక్కులో ఇటుకలు తీసుకెళ్తున్నారు. 
 
ఘిరోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోస్మా చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఈ లారీ‌ని అడ్డుకున్నారు. లారీని విడిచి పెట్టాలంటే 100 రూపాయలు ఇవ్వాలని హెచ్చరించారు. అయితే దీనికి ఇద్దరు యువకులు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. చిన్నగా మొదలైన గొడవ పెద్దది కావడంతో కార్మికులు నెట్రాపాల్, రాధామోహన్ అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో దిలీప్, పంకజ్‌లను పోలీసులు గొడ్డను బాధినట్టుబాదారు. 
 
దెబ్బలకు తట్టుకోలేని వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు.. బాధిత కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అక్కడకొచ్చిన ఇద్దరు పోలీసులను చితకబాదారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులు పోలీసులపై కేసులు నమోదు చేశారు. 
 
దీంతో స్పందించిన పోలీసు అధికారులు ఈ ఘటనలో ప్రమేయమున్నట్టుగా భావిస్తున్న హోంగార్డును, పదకొండు మంది పోలీసులను విధుల నుండి తొలగించారు. పోలీసులను చూసి పారిపోయి ఓ చెరువులో పడి దిలీప్, పంకజ్ మృతి చెందారని పోలీసులు కల్ల బొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో వారి ఒంటి పై గాయాలు ఉండడం.. గాయాల కారణంగానే వారు మృతి చెందినట్టు తేలడంతో పోలీసుల నిజరూపం బయటపడింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments