సూర్యుడి అరుదైన చిత్రాలను బంధించిన ఆదిత్య ఎల్-1

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2023 (09:20 IST)
సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పంపించిన ఆదిత్య ఎల్-1 అరుదైన చిత్రాలను తీసింది. అతినీలలోహిత తరంగ దైర్ఘ్యం సమీపంలో నుంచి సూర్యుడి చిత్రాలను ఫోటోలు తీసింది. ఈ ఫోటోలను ఇస్రో షేర్ చేసింది. సౌరకుటుంబ పరిశోధనలో ఇదో కీలక మైలురాయి అని అభివర్ణించింది. 
 
ఆదిత్య ఎల్-1లోని సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలీస్కోప్ పేలోడ్.. సూర్యుడి 200 నుంచి 400 నానో మీటర్ల తరంగదైర్ఘ్య పరిధిలోని చిత్రాలను తీసింది. అందులో ఉన్న శాస్త్రీయ ఫిల్టర్లను ఉపయోగించి సూట్ వీటిని తన కెమెరాల్లో బంధించింది. ఈ ఫుల్-డిస్క్ చిత్రాల ద్వారా సూర్యుడి ఫొటోస్పియర్, క్రోమోస్పియర్లకు సంబంధించి క్లిష్టమైన వివరాలను తెలుసుకోవచ్చు. అయస్కాంత క్షేత్రం గురించి తెలుసుకోవడంలో ఈ చిత్రాలు కీలక సమాచారాన్ని అందిస్తాయని ఇస్రో వెల్లడించింది. 
 
ఇదిలావుండగా, సూర్యుడిపై అధ్యయనం కోసం ఈ ఏడాది సెప్టెంబరు 2న నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్-1 తన ప్రయాణంలో చివరి దశను చేరుకుంది. ఈ ఉపగ్రహాన్ని ఎల్-1 పాయింట్‌లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ నాటికి పూర్తవుతాయని ఇటీవల ఇస్రో వెల్లడించింది. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 చేరాక.. దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఆదిత్య-ఎల్ 1 సూర్యుడిని అధ్యయనం చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments