అత్యాచారం చేసి... భవనంపై నుంచి కిందికి తోసేశారు...

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (20:31 IST)
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువతిపై అత్యాచారం చేసిన దుండగులు ఆమెను భవనం నుంచి కిందికి తోసేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం, పార్లే పాయింట్ ఏరియాలో ఓ 18 యేళ్ళ యువతిపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు బాధితురాలిని భవనం నుంచి కిందికి తీసేశారు.
 
దాంతో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల మ‌ధ్య‌గా ఉన్న రోడ్డుపై ఆ యువ‌తి ప‌డిపోయింది. తీవ్ర గాయాల‌తో అప‌స్మార‌క స్థితిలో ప‌డివున్న యువ‌తిని చూసి స్థానికులు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని యువ‌తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.
 
ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గురువారం ఉద‌యం ఆప‌స్మార‌క స్థితిలో ఉన్న యువ‌తిని ఆస్ప‌త్రి చేర్చామ‌ని, అదేరోజు సాయంత్రానికి ఆమె స్పృహ‌లోకి వ‌చ్చింద‌ని పోలీసులు చెప్పారు. 
 
అయితే నిందితుడు ఎవ‌ర‌నే విష‌యాన్ని బాధితురాలి చెప్ప‌లేక‌పోతున్న‌దని, తాము ప్ర‌స్తుతం నిందితుడిని గుర్తించే ప‌నిలో ఉన్నామ‌ని తెలిపారు. నిందితుడు ప‌ట్టుబ‌డితే కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంద‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments