Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బాలికపై అత్యాచారం జరగలేదు.. విషం తాగి చనిపోయింది.. ప్రేమే కారణమా?

Webdunia
సోమవారం, 20 జులై 2020 (14:38 IST)
పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి కూతురిని తండ్రే అత్యాచారానికి పాల్పడి చంపేశాడని ఆరోపణలు వచ్చాయి.

కానీ పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆమెపై రేప్ జరగలేదని నివేదికలో వెల్లడి అయ్యింది. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. లైంగిక దాడి జరిగినట్లు ఆనవాళ్లు లేవని వైద్యులు చెప్పారు. శరీరంలో విషం లభించిందని.. విషం సేవించడం వల్లే చనిపోయిందని స్పష్టం చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తర దినజ్‌పూర్‌ జిల్లాలోని సోనార్‌పూర్ ప్రాంతంలో ఆదివారం 15 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. ఇంటి నుంచి ఆమెను కిడ్నాప్ చేశారని.. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే శవమై కనిపించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక మృతదేహం ఇంటి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద లభ్యమైంది. ఘటనా స్థలంలో విషం బాటిల్‌తో పాటు మొబైల్ ఫోన్ దొరికింది.
 
ఆ మొబైల్ ఆధారంగా పోలీసులు జరిపిన విచారణలో ఆ యువకుడికి మృతురాలికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. బాలిక చనిపోయిన మర్నాడే అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం సోనార్‌పూర్‌లోని చెరువు వద్ద ఫిరోజ్ అనే అతడి మృతదేహం లభ్యమైంది. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం