Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగానదిలో ఎదురీత.. 14 ఏళ్ల బాలుడే హీరో.. మిగతా ఇద్దరు..!?

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (14:56 IST)
గంగానదిలో ఎదురీదిన 14 బాలుడే హీరో అయిపోయాడు. అంతేకాదు.. ప్రాణాలను ఫణంగా పెట్టిన ఆ 14 ఏళ్ల బాలుడు ముగ్గురిని కాపాడాడు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలో ఐదుగురు యువతులు కొట్టుకుపోతుండటం చూసి.. తన ప్రాణాలను ఫణంగా పెట్టిన గొర్రెల కాపరి అయిన ముస్లింఖాన్ అత్యంత సాహసంతో ముగ్గురిని కాపాడాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాస్ గంజ్ జిల్లా, కాదర్ గంజ్ సమీపంలో జరిగింది. 
 
నదికి ఆవల ఉన్న పొలంలో పనికి వెళుతున్న ఐదుగురు అమ్మాయిలు నదిని దాటుతూ, ప్రమాదవశాత్తూ కాలుజారి కొట్టుకుపోవడం ఖాన్ కంటపడింది. వెంటనే నదిలో దూకిన ఖాన్ కొట్టుకుపోతున్న అమ్మాయిలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాడు. తనకు బాగా ఈత వచ్చినందునే నదిలో దూకానని, మిగతా ఇద్దరూ కళ్లముందే కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయానని ఖాన్ చెప్పాడు. 
 
ముస్లింఖాన్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ, అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన బాలలకు ఇచ్చే అవార్డులకు అతని పేరును సిఫార్సు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు గల్లంతైన అఫ్రోజా, గుల్షన్‌ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments