Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభలో రభస : 12 మంది విపక్ష సభ్యుల సస్పెండ్

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (17:14 IST)
గత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సభలో దురుసుగాను, హింసాత్మకంగా ప్రవర్తించిన 12 మంది విపక్ష సభ్యులను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తాజా సమావేశాల్లో సస్పెండ్ చేశారు. ఈ సమావేశాలు ముగిసేంత వరకు వారు సభలో ప్రవేశించడానికి వీల్లేదని ఆయన సోమవారం ఆదేశాలు జారీచేశారు. 
 
దీంతో సభ నుంచి సస్పెండ్ అయిన విపక్ష సభ్యుల్లో ఎలమరం కరీం (సీపీఎం), పూలో దేవి నేతమ్ (కాంగ్రెస్), చాయా వర్మ (కాంగ్రెస్), రిపున్ బోరా (కాంగ్రెస్), బినోయ్ విశ్వ (సీపీఐ), రాజమణి పటేల్ (కాంగ్రెస్), డోలాసేన్ (టీఎంసీ), శాంతి ఛైత్రి (టీఎంసీ), ప్రియాంక చతుర్వేది (శివసేన), అనిల్ దేశాయ్ (శివసేన), అఖిలేష్ ప్రసాద్ సింగ్ (కాంగ్రెస్), సయ్యద్ నాసిర్ హుస్సేన్ (కాంగ్రెస్)లు ఉన్నారు. 
 
కాగా, ఈ విపక్ష సభ్యుల సస్పెండ్‌పై రాజ్యసభ ఒక ప్రకటన జారీచేసింది. "రాజ్యసభ 254వ సెషన్ చివరి రోజు, అంటే ఆగస్టు 11వ తేదీన భద్రతా సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగా దాడుల ద్వారా సభా కార్యక్రమాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తుంది. సభ, సభాపతి అధికారాన్ని పూర్తిగా విస్మరించడం, సభా నియమాలను పూర్తిగా దుర్వినియోగం చేయడం, దుష్ప్రవర్తన, ధిక్కార, వికృత, హింసాత్మక ప్రవర్తన, ఉద్దేశపూర్వక దాడుల ద్వారా సభ మర్యాదను దిగజార్చడం వంటి వాటికి పాల్పడ్డారు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments