పూణెలో దారుణం - బాలికపై ఐదేళ్లుగా తండ్రి, అన్న అత్యాచారం

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (09:38 IST)
మహారాష్ట్రలోని పూణెలో ఓ అమానవీయ సంఘటన జరిగింది. కన్నబిడ్డపై ఐదేళ్లుగా కన్నతండ్రి అత్యాచారం చేస్తూ వచ్చాడు. అతనేకాదు తోడబుట్టిన సోదరుడు, తాత, మావయ్యలు కూడా ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ విషయం స్కూల్‌లో ఉపాధ్యాయలు ఇటీవల గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులందరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ నుంచి వలస వచ్చిన ఓ కుటుంబం పుణెలో ఉంటోంది. వీరిలో 11 యేళ్ల బాలిక స్థానికంగా ఓ పాఠశాలలో చదువుకుంటుంది. అయితే, ఇటీవల పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో ఆ బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని బయటపెట్టింది. 
 
2017 నుంచి తండ్రే అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు చెప్పింది. అలాదే తన అన్న కూడా గత 2020 నుంచి ఈ నీచానికి పాల్పడుతున్నట్టు బోరున విలపిస్తూ చేపింది. వీరిదిద్దరే కాదు, తాత, మామయ్యలు కూడా ఈ తరహా లైంగిక వేధింపులకు గురిచేసినట్టు వెల్లడించింది. 
 
దీంతో కౌన్సెలింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, ఇది సామూహిక అత్యాచారం కాదని, నిందితులంతా వేర్వేరు సమయాల్లో ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారని పెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం