Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ ఘటన.... యూట్యూబ్ చూస్తూ 11 యేళ్ల బాలుడు ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 24 డిశెంబరు 2023 (09:11 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 11 యేళ్ల బాలుడు యూట్యూబ్ చూస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని హమీర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ బాలుడు.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఎలా చనిపోవాలన్న అంశంపై యూట్యూబ్‌ వీడియోలు చూసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
 
మృతుడిని నిఖిల్‌ సాహూగా గుర్తించారు. ఆరో తరగతి విద్యార్థి. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇందుకోసం "వేస్ టు డై" అనే వీడియోను చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి అత్మహత్య అనే విషయమని పోలీస్ విచారణలో వెల్లడైందని తెలిపారు. అయితే, ఈ దారుణానికి పాల్పడటానికి కారణాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. 
 
ఎముకలోని మూలుగు కోసం రద్దయిన పెళ్లి....ఎక్కడ? 
 
హాస్య నటుడు వేణు దర్శకత్వంలో వచ్చిన చిత్రం "బలగం". ఈ చిత్రంలో ఎముక మూలుగు కోసం బావ బామ్మర్ధులు గొడవపడతారు. అచ్చం అలాగే, బొక్క మూలుగు (గుజ్జు) కోసం గొడవ జరిగింది. దీంతో ఏకంగా పెళ్ళిని రద్దు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో వెలుగు చూసింది. 
 
ఈ మండలానికి చెందిన ఓ యువతీయువకుడికి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. కట్నకానుకలు సైతం మాట్లాడుకున్నారు. నవంబరు మొదటి వారంలో నిశ్చితార్థం జరిగింది. ఆ సందర్భంగా యువతి ఇంట్లో మాంసాహారంతో విందు భోజనం ఏర్పాటు చేశారు.
 
ఈ విందుకు వచ్చిన వరుడు తరపు బంధువులు మూలుగు బక్క కావాలని అడగడంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. గొడవ పెద్దదై చివరికి పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లింది. ఆ తర్వాత ఇరు వర్గాలు శాంతించినప్పటికీ ఈ పెళ్లి సంబంధం మాత్రం రద్దు అయింది. ఈ విషయం స్థానికంగా సంచలనం సృష్టించినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments