Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు నెలల తర్వాత మళ్లీ వెయ్యి నోటు వస్తోందా?

పెద్ద నోట్ల రద్దు తర్వాత మాయమైపోయిన వెయ్యినోట్లను మళ్లీ ప్రవేశపెట్టడానికి భారత రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నాయని, ఈ కసరత్తు తుదిదశకు చేరుకున్నదని విశ్వసనీయ సమాచారం.

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (03:00 IST)
పెద్ద నోట్ల రద్దు తర్వాత మాయమైపోయిన వెయ్యినోట్లను మళ్లీ ప్రవేశపెట్టడానికి భారత రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నాయని, ఈ కసరత్తు తుదిదశకు చేరుకున్నదని విశ్వసనీయ సమాచారం..దేశంలోని నల్లధనాన్ని అణచివేసేందుకు రూ. 500, రూ. వెయి నోట్లను ప్రధాని నరేంద్రమోదీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాటిస్థానంలో కొత్తగా రూ. 2వేలు, రూ. 500 నోట్లను ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొత్తగా రూ. వెయ్యినోట్లను కూడా మళ్లీ ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది. 
 
ఇప్పటికే రూ. వెయ్యినోట్ల ముద్రణ ప్రక్రియను ఆర్బీఐ ప్రారంభించిందని, అయితే ఎప్పటిలోగా మార్కెట్లోకి ఇవి రానున్నాయన్నది కచ్చితంగా తెలియదని పేర్కొంది. రద్దైన పాత నోట్ల లోటును భర్తీ చేయడానికి కొత్తగా రూ. వెయ్యి నోట్లను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. గత జనవరిలోనే కొత్త వెయ్యినోట్లు మార్కెట్లోకి రానున్నాయని ప్రచారం జరిగింది. 
 
అయితే, మార్కెట్‌లో తగినంత చిల్లర లేక సమస్యలు ఎదురవుతుండటంతో మొదట రూ. 500 నోట్లను ముద్రణకు ప్రాధాన్యం ఇవ్వడంతో కొత్త రూ. వెయ్యి నోట్ల రాక ఆగిపోయిందని అంటున్నారు. గత ఏడాది నవంబర్‌ 8న పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడంతో రూ. 15.44 లక్షల విలువైన రూ. వెయ్యి, రూ. 500 నోట్లను మార్కెట్‌ నుంచి ఉపసంహరించి.. బ్యాంకుల ద్వారా వీటి బదిలీ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments