Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్ట నొప్పితో ఆస్పత్రికి వెళ్లింది.. ఆపరేషన్ చేస్తే.. కేజీన్నర బంగారం..

Webdunia
గురువారం, 25 జులై 2019 (18:05 IST)
పొట్టనొప్పిగా వుందని ఓ మహిళ ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు పరీక్షల తర్వాత ఆపరేషన్ చేయాలని వైద్యులు తేల్చేశారు. దీంతో ఆపరేషన్ చేసిన వైద్యులకు షాక్ తప్పలేదు. ఆమె కడుపులో ఏకంగా కేజీన్నరకు పైగా బంగారు నగలు వుండటంతో షాకయ్యారు. పశ్చిమబెంగాల్‌లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌లోని బీర్‌భూమ్‌ జిల్లా రామ్‌పురహాట్‌కు చెందిన ఓ మహిళ కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఏం జరిగిందో ఏంటోనన్న ఆందోళనతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆమె కడుపులో ఏదో లోహ పదార్థాలు ఉన్నాయని గుర్తించారు. 
 
శస్త్రచికిత్స చేయడంకంటే మరో మార్గం లేదని స్పష్టం చేశారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. ఆమె కడుపులో బంగారు నగలు ఉండడంతో షాక్‌ తిన్నారు. గొలుసులు, దుద్దులతోపాటు ఇనుప వస్తువులు కూడా ఉండడంతో షాకయ్యారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పగా.. ఇంతకీ ఆ లోహాలను ఆమె ఎందుకు మింగిందో తెలియట్లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments